Veeramachineni diet plan in telugu PDF
- This topic has 3 replies, 3 voices, and was last updated 2 years, 4 months ago by .
Viewing 3 reply threads
Viewing 3 reply threads
- You must be logged in to reply to this topic.
› Forums › Health & Fitness › Weight Loss › Veeramachineni diet plan in telugu PDF
Anyone have telugu PDF for veeramachineni weight loss diet plan?
Veeramachineni diet plan in telugu:
ఫుడ్ ప్రోగ్రాం : –
ఒబేసిటీ మరియు డయాబెటిస్ ను మందులు మరియు వ్యాయామం చేయ కుండా ఏ విధముగా ఆహారపు అలవాట్లు మార్చుకోనుట ద్వారా నియంత్రించవచ్చో తెలియచేసినారు. ఈ విషయాలు వారికిఉన్న సమస్యను బట్టి 15 నుండి 30 రోజులు ఆచరించాలి. తరువాత పొట్ట మరియు వెయిట్ తగ్గిన తరువాత కొద్దీ పాటి జాగ్రత్తలతో అన్ని తినవచ్చు.
1st రూల్ :-
రోజుకు 70 గ్రామ్ – 100 గ్రామ్ ల ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ కొరకు వాడాల్చిన నూనెలు.
(a)వంట కొబ్బరి నూనె
(b)నాటు ఆవు నెయ్యి
(c)అలివ్ ఆయిల్
(d)పాల మీద మీగడ లేదా వెన్న లేదా బట్టర్ .
ఫ్యాట్ కి సంబందించి పైన నూనెలు మాత్రమే పైన చెప్పిన క్వాంటిటీ లో తీసుకోవాలి.
2 వ రూల్ :-
రోజు కు 3 నిమ్మకాయలు వాడాలి. పల్చటి మజ్జిగలో ఉప్పు లేకుండా ఈ నిమ్మరసం రోజులో ఎదో ఒక టైంలో త్రాగవచ్చు.
3 వ రూల్ :-
రోజుకు నాలుగు లీటర్ల మంచినీరు త్రాగాలి.
4 వ రూల్ :-
రోజు రాత్రి ఒక Multi విటమిన్ టాబ్లెట్ తీసుకోవాలి.
పై నాలుగు రూల్స్ అనుసరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు :-
1. పైన పేర్కొన్న నాలుగు రకాల ఆయిల్స్ తప్ప ఎటువంటి రిఫైనెడ్ ఆయిల్స్ వాడరాదు.
2. సముద్రపు కళ్ళు ఉప్పు మాత్రమే వాడాలి.
3. చింతపండు వాడరాదు.
4. Tasting సాల్ట్ వాడరాదు.
5. ఈ ఎనిమిది రకాల కూరగాయలు పూర్తిగా నిషిద్ధం. బంగాళదుంప, చిలకడ దుంప,చెమ
దుంప,పెండలం, కంద, బీట్రూట్, అరటి మరియు బీన్స్.
6.ఉల్లి,క్యారెట్ మరియు టమోటో లు రోజుకి ఒకటీ వాడవచ్చు.
7. మిగిలిన కూరగాయలు unlimited గా తీసుకోవచ్చు.
8.vegtables అన్ని ఉప్పు నీళ్ల లో కడిగి వండాలి.
9.డీప్ ఫ్రై ల కు ఆలివ్ ఆయిల్ వాడరాదు.
10. పై నాలుగు రూల్స్ పాటించేటప్పుడు రైస్,ధాన్యాలు, స్వీట్స్, ఫ్రూట్స్ మరియు కూల్డ్రింక్స్ అసలు తినరాదు.
11.Eggs with yellow తినవచ్చు.( 0-6 per day)
12. Non Veg రోజుకు 250 గ్రామ్స్ – 300 గ్రామ్స్ వరకు తినవచ్చు.
13. మటన్ బోన్స్ సూప్ త్రాగవచ్చు.
14.Chicken Tanduri,Tikka, Kabab, Grill Chicken లను కలర్ మరియు కార్న్ లేకుండా తినవచ్చు.
15. పన్నీర్ రోజుకు 100 గ్రామ్స్ వరకు తినవచ్చు.
16. పెరుగు వాడరాదు.
17. పల్చటి మజ్జిగ వాడవచ్చు.
18. కొబ్బరి నీళ్లు త్రాగరాదు.
19 పాలు త్రాగరాదు.
20.గ్రీన్ టీ త్రాగవచ్చు.
20. పంచదార , హనీ వాడరాదు.
21. కూరల్లో కొద్దిగా పాలు పోసుకొని వండుకోవచ్చు.
22.ఈ పద్ధతి లో మూడు రకాలైన నట్స్ వాడాలి. బాదంపప్పు, పిస్తా పప్పు, వాలనట్స్ రోజుకు 1-10 చొప్పున తినాలి.
23.ఈ పద్దతి లో కొన్ని రకాలైన గింజలు కూడా తీసుకోవాలి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మరియు water melon సీడ్స్ రోజుకు 4- 5 స్పూన్స్ తినవచ్చు.
24 తెల్ల నువ్వులు మరియు ఆవిసే గింజలు powder గా mix చేసి రోజు 2 స్పూన్స్ తినాలి.
25 ముల్లంగి సొర బీర, కీరా వంటి ఫైబర్ వుండే వాటిని కూడా తీసుకోవాలి.
25.ఆకలి వేసినప్పుడూ మాత్రమే ఏదయినా తినాలి.
26. ఆకలి తీరెవరకు తినాలి.
ఇది కార్బోహైడ్రేట్స్ ను పూర్తిగా avoid చేసి ఫాట్ అండ్ ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకొని డయాబెటిస్, బి.పి, కోలేష్ట్రల్ వంటి వాటిని నియంత్రించే పద్దతి అని చెపుతున్నారు. చా లా మంది ఈ పద్దతి పాటించి బెనిఫిట్ పొందామని చెపుతున్నారు నమ్మకం కలిగితే ఆచరించి చూడండి.
Here is the telugu PDF for Veeramachineni Ramakrishna diet plan to download: https://fashiontalk.in/wp-content/uploads/2018/09/veeramachineni-diet-plan-telugu-pdf-1.pdf